Wednesday, March 20, 2019

పూణే వెళ్తున్న రామరాజు భీంలు

జయ్ దేవగన్ అలియా భట్ లు ఇందులో పాల్గొనే అవకాశం లేదని తెలిసింది. అలియా భట్ జూలై తరువాతే జాయిన్ అవుతుందని సమాచారం. ఇప్పటిదాకా హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీతో పాటు మరికొన్ని లొకేషన్స్ లో రెండు షెడ్యూల్స్ తీసిన ఆర్ఆర్ఆర్ ఇప్పుడు పూణేతో పాటు అహ్మదాబాద్ కూడా వెళ్తుంది. నార్త్ లో సాగే కథ అని చెప్పారు కాబట్టి ఈ ప్రాంతాలు కీలకంగా మారుతున్నాయి. మరోవైపు కీరవాణి ట్యూన్స్ కంపోజింగ్ మొదలు పెట్టారు. 


ఇప్పటికే సుద్దాల అశోక్ తేజ్ రాసిన గీతం అద్భుతంగా వచ్చిందని ఆయనే కొద్దిరోజుల క్రితం ట్వీట్ పెట్టిన సంగతి తెలిసిందే. మిగిలిన ట్యూన్స్ కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. ఇంకొందరు కీలక ఆర్టిస్టుల సెలక్షన్ జరగాల్సి ఉంది. ఆర్ ఆర్ ఆర్ పూణే షెడ్యూల్ పూర్తి చేసుకున్నాక ఎక్కడ ప్లాన్ చేశారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. హైదరాబాద్ లోనే కంటిన్యూ కావొచ్చు. పూణేలో సైతం కొన్ని ప్రత్యేకమైన సెట్స్ వేసినట్టు వినికిడి. 400 కోట్ల దాకా బడ్జెట్ తో రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ విడుదలకు ఏడాదిన్నర టైం ఉన్నా హైప్ మాత్రం అప్పుడే ఓ రేంజ్ లో ఉంది
Quantity : Add to Cart

No comments:

Post a Comment

all image